Ramoji Rao: రామోజీరావులో నేను ఓ చిన్నపిల్లవాడిని చూశా: మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi condolence for Ramoji Rao death

  • రామోజీరావు కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని వ్యాఖ్య
  • ప్రజారాజ్యం పార్టీ కోసం సలహాలు, సూచనలు తీసుకున్నానని వెల్లడి
  • తాను పెన్నును బహుమతిగా ఇస్తే ఎంతో సంబరపడ్డారన్న చిరంజీవి
  • రామోజీరావు గొప్ప దార్శనికుడు... అన్ని రంగాల్లో విజయం సాధించారన్న నాగార్జున

అందరూ రామోజీరావులోని గాంభీర్యాన్ని చూస్తే తాను మాత్రం చిన్నపిల్లాడిని చూశానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివదేహానికి శనివారం మధ్యాహ్నం నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... రామోజీ కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళ్లాలన్నారు.

రామోజీరావుతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తాను ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఓ పెన్ను ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకుని... సంబరపడ్డారని తెలిపారు. ఆయన దాచుకున్న పెన్నులను తనకు చూపించారన్నారు. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అన్నారు. తెలుగు జాతి ఒక పెద్దను కోల్పోయిందన్నారు. ఆయన సమాజహితం కోసం పని చేశారన్నారు. సమాజానికి ఏం చేయాలో నిత్యం అక్షరరూపంలో రాసేవారన్నారు.

గొప్ప దార్శనికుడు: నాగార్జున

రామోజీరావు గొప్ప దార్శనికుడు, ఎంచుకున్న ప్రతి రంగంలో విజయాలను అందుకున్నారని నటుడు నాగార్జున అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News