Ramoji Rao: తెలుగు ప్రజల జీవితాల్లో రామోజీ ఒక విడదీయలేని భాగం: జస్టిస్ ఎన్వీ రమణ

Justice NV Ramana condolences to Ramoji Rao demise

  • కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రామోజీ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జస్టిస్ ఎన్వీ రమణ 

తెలుగు పాత్రికేయ రంగానికి కొత్త ఒరవడి దిద్దిన అక్షర యోధుడు రామోజీరావు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. 

రామోజీరావు మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు ప్రజల జీవితాల్లో రామోజీ ఒక విడదీయలేని భాగం అని అభివర్ణించారు. 

ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు తెలుగు ప్రజల జీవితాలతో రామోజీ మమేకమై ఉన్నారని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన సిసలైన యోధుడు రామోజీరావు అని కీర్తించారు.

Ramoji Rao
Demise
NV Ramana
Eenadu
ETV
Supreme Court
  • Loading...

More Telugu News