Ramoji Rao: రామోజీరావు మృతి తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం: కేఏ పాల్

KA Paul condolence for Ramoji Rao death

  • రామోజీరావు మృతి పట్ల కేఏ పాల్ సంతాపం
  • తొలిసారి ఈటీవీ ద్వారానే శాంతి సందేశంతో ముందుకు వచ్చానని వెల్లడి
  • శాంతి సందేశాలు మతపరమైనవి కావని ఆయన భావించారని వ్యాఖ్య

రామోజీరావు మృతి తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రామోజీరావు మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. తాను తొలిసారి ఈటీవీ ద్వారానే శాంతి సందేశంతో ప్రజల ముందుకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. శాంతి సందేశాలు మతపరమైనవి కావని ఆయన భావించారని పేర్కొన్నారు.

రామోజీరావు మరణ వార్త విని చాలా బాధపడ్డానని తమిళ నటుడు కమల్ హాసన్ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఓ అద్భుతమని కొనియాడారు. అది కేవలం షూటింగ్ లొకేషన్ మాత్రమే కాదని... ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా అన్నారు. అంత దూరదృష్టి, వినూత్న ఆలోచనాపరుడు రామోజీరావు అన్నారు. ఆయన మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Ramoji Rao
KA Paul
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News