SS Rajamouli: రామోజీకి భారతరత్న ఇవ్వాల‌న్న రాజ‌మౌళి.. దీనిపై అల్లు అర్జున్ స్పంద‌న ఇదీ!

SS Rajamouli Pay Tribute to Ramoji Rao

  • రామోజీరావు మృతిపట్ల ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌ రాజ‌మౌళి సంతాపం
  • ఆయ‌న‌కు భారతరత్న ఇవ్వడ‌మే స‌రియైన నివాళి అంటూ వ్యాఖ్య‌
  • నా మనసులో కూడా అదే భావన కలిగింది సార్ అంటూ బ‌న్నీ రిప్లై

ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీరావు మృతిపట్ల టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌ రాజ‌మౌళి సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ రామోజీరావుకి భారతరత్న ఇవ్వడం సముచిత గౌరవం అని పేర్కొన్నారు.

"ఒక మనిషి 50 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం అనేది మాములు విష‌యం కాదు. వాటిద్వారా ఎన్నో లక్షల మందికి జీవనోపాధి, ఆశలను అందించి మార్గదర్శకంగా నిలిచారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే స‌రియైన నివాళి అవుతుంది" అంటూ రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో రాసుకోచ్చారు. 

ఇక రాజ‌మౌళి ట్వీట్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. "నా మనసులో కూడా అదే భావన కలిగింది సార్. మీరు నా మ‌న‌సులోని మాట చెప్పారు. మీరు నా హృదయంతో మాట్లాడారు. దానికి గాత్రదానం చేసినందుకు ధన్యవాదాలు" అంటూ బ‌న్నీ రిప్లై ఇచ్చాడు.

SS Rajamouli
Ramoji Rao
Allu Arjun
Twitter

More Telugu News