Ramoji Rao: రామోజీరావుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రోజా

Roja condolences to the demise of Ramoji Rao

  • ఈనాడు అధిపతి రామోజీరావు కన్నుమూత
  • గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో రామోజీ
  • పాత్రికేయ, టీవీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్న రోజా

తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. రామోజీ మృతి నేపథ్యంలో, సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఏపీ మాజీ మంత్రి, నటి రోజా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ప్రముఖ సినీ నిర్మాత, పాత్రికేయ, టీవీ రంగంలో విప్లవాత్మక మార్పును, విశేష కృషిని అందించిన పద్మవిభూషణ్ రామోజీరావు గారి మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు అని రోజా పేర్కొన్నారు. 

"వారి సంస్థ ఉషాకిరణ్ లో పనిచేసిన నాటి రోజుల నుంచి ప్రతి ఇంట నవ్వులు పూయించిన టీవీ షో జబర్దస్త్ వరకు వారితో ఉన్న నా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నాను. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అంటూ రోజా ట్వీట్ చేశారు.

Ramoji Rao
Demise
Roja
Eenadu
ETV
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News