Ramoji Rao Death: గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్‌లో రామోజీరావుకు నటుడు రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ నివాళి

Game Changer Movie Unit Tributes Media Moghul Ramoji Rao
  • రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’
  • షూటింగ్ స్పాట్‌లో రెండు నిమిషాలు మౌనం పాటించిన టీం
  • పత్రికా రంగంపై రామోజీ చెరగని ముద్రవేశారన్న చిత్ర బృందం
పత్రికా రంగంలో అడుగుపెట్టి సంచలనాలు నమోదుచేసి, ఆ రంగంపై చెరగని ముద్రవేసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రముఖ నటుడు రామ్‌చరణ్, దర్శకుడు శంకర్, సునీల్, రఘు కారుమంచి, యూనిట్ సభ్యులు నివాళులు అర్పించారు. 

వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. రామోజీ మరణ వార్త తెలిసిన వెంటనే చిత్ర బృందం అక్కడే రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రామోజీ మరణం తీరని బాధాకరమని, ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. 

ప్రాంతీయ మీడియా స్వరూపాన్ని మార్చేశారు: రామ్‌చరణ్
ఈ సందర్భంగా రామ్‌చరణ్ ఎక్స్‌లో తన సంతాపాన్ని ప్రకటించారు. ఈనాడు పేపర్‌తో ప్రాంతీయ మీడియా స్వరూపాన్నే రామోజీ మార్చివేశారని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపన ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్ర నిర్మాతలకు ల్యాండ్ మార్క్ అయిందని పేర్కొన్నారు. రామోజీ తన ఆప్యాయతతో తెలుగు ప్రజలకు చేసిన విశేష కృషికి చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Ramoji Rao Death
Ramcharan
Director Shankar
Game Changer

More Telugu News