Kangana Ranaut: కంగనపై ప్రేమ తగ్గలేదు కానీ.. చెంపదెబ్బపై స్పందించిన షబానా ఆజ్మీ

Shabana Azmi reacts on Kangana Ranaut slap row

  • చండీగఢ్ ఎయిర్‌పోర్టులో కంగన చెంప చెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డు 
  • సెలబ్రేట్ చేసుకుంటున్న వారి జాబితాలో తాను చేరబోనన్న షబానా 
  • 2020 కంగనపై పరువునష్టం దావా వేసిన షబానా భర్త జావేద్ అక్తర్

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగన రనౌత్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన వ్యవహారంపై సీనియర్ నటి షబానా ఆజ్మీ స్పందించారు. ఈ ఘటనతో ఆమెపై తనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని చెప్తూనే, ఈ ఘటనతో సంబరాలు చేసుకుంటున్న వారి జాబితాలో తాను చేరబోనని స్పష్టం చేశారు. ప్రజలను రక్షించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఇక ప్రజలను రక్షించేది ఎవరని ఆవేదన వ్యక్తంచేశారు.

2020లో ఓ ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి విషయంలో చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ షబానా భర్త జావేద్ అక్తర్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ విషయంలో కంగన చిక్కులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షబానా ఆజ్మీ ఇలా స్పందించారు.

  • Loading...

More Telugu News