T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో శ్రీలంక‌పై బంగ్లాదేశ్ గెలుపు

Bangladesh won by 2 wickets against Sri Lanka
  • డ‌ల్లాస్ వేదిక‌గా బంగ్లాదేశ్‌, శ్రీలంక మ్యాచ్‌
  • 2 వికెట్ల‌తో తేడాతో లంక‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌
  • ఇప్ప‌టికే తొలి మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక‌
  • ఇప్పుడు రెండో ఓట‌మితో సూప‌ర్‌-8 అవ‌కాశాలు సంక్లిష్టం
టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక‌కు ఘెర ప‌రాభ‌వం ఎదురైంది. డ‌ల్లాస్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మి పాలైంది. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 124 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ నిస్సాంక 47 ర‌న్స్‌తో రాణించ‌గా, ధ‌నుంజ‌య 21, డిసిల్వా 19 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించారు. మిగ‌తా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. బంగ్లా బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్‌, రిష‌ద్ హుస్సేన్ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టి లంక బ్యాట‌ర్ల‌కు క‌ళ్లెం వేశారు. 

అనంత‌రం 125 ప‌రుగుల స్వ‌ల్ప ఛేద‌న‌తో బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్ 19 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. హృదోయ్ 40, లిట‌ర్ దాస్ 36 బంగ్లాదేశ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో నువాన్ తుషార 4, హస‌రంగ 2 వికెట్లు తీశారు. ఇక ఈ ఓట‌మితో శ్రీలంక సూప‌ర్‌-8 అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్ప‌టికే త‌న తొలి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయింది. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ ప‌రాజ‌యంతో రెండో ఓట‌మిని త‌న ఖాతాలో వేసుకుంది.
T20 World Cup 2024
Sri Lanka vs Bangladesh
Cricket
Sports News

More Telugu News