T20 World Cup 2024: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పెను సంచ‌ల‌నం.. కివీస్‌కు ఆఫ్గ‌నిస్థాన్ షాక్‌!

Afghanistan won by 84 runs against New Zealand

  • 84 ప‌రుగుల తేడాతో ప‌సికూన ఆఫ్గ‌నిస్థాన్ గ్రాండ్ విక్ట‌రీ 
  • ఆఫ్గ‌నిస్థాన్ నిర్ణీత 20 ఓవర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 159 ర‌న్స్
  • 75 ప‌రుగుల‌కే ఆలౌటైన న్యూజిలాండ్‌
  • 56 బంతుల్లో 80 ర‌న్స్ చేసిన గుర్బాజ్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మ‌రో పెను సంచ‌ల‌నం న‌మోదైంది. టైటిల్ ఫేవ‌రేట్ల‌లో ఒక‌టైన న్యూజిలాండ్‌కు ప‌సికూన ఆఫ్ఘనిస్థాన్ షాక్ ఇచ్చింది. గ్రూప్‌-సీలో భాగంగా ఇవాళ జ‌రిగిన మ్యాచులో ఏకంగా 84 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 

మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 159 ర‌న్స్ చేసింది. ఆ జ‌ట్టులోని బ్యాట‌ర్ల‌లో గుర్బాజ్ 80, జద్రాన్ 44 ప‌రుగుల‌తో రాణించారు. ట్రెంట్ బౌల్ట్‌, హెన్రీ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, లూకీ ఫెర్గూస‌న్ ఒక వికెట్ తీశాడు. 

అనంత‌రం 160 ప‌రుగుల లక్ష్య‌ఛేద‌న‌తో బ్యాటింగ్ చేసిన కివీస్ 75 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఫ‌రూకీ, ర‌షీద్ ఖాన్ న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తించారు. దీంతో ఫిలిప్స్ 18 ప‌రుగులు త‌ప్పితే మిగ‌తా బ్యాట‌ర్లు సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మయ్యారు. 56 బంతుల్లోనే 80 ర‌న్స్ చేసిన గుర్బాజ్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. 

ఇక ఈ టోర్నీలో ఇప్ప‌టికే పాకిస్థాన్‌ను ప‌సికూన అమెరికా ఓడించి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ప‌రాజ‌యం పాలైంది. దీంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ లీగ్ స్టేజ్ రసవత్తరంగా మారుతోంది.

  • Loading...

More Telugu News