Narendra Modi: జూన్ 9న రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ

PM Modi will take oath on June 9 at Rashtrapati Bhavan

  • వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ
  • మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్న రాష్ట్రపతి
  • అదే సమయంలో క్యాబినెట్ సభ్యులతోనూ ప్రమాణ స్వీకారం

వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 9వ తేదీ రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. నరేంద్ర మోదీతోనూ, మంత్రివర్గ సభ్యులతోనూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. 

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరి భేటీ దాదాపు అరగంట పాటు సాగింది. అనంతరం చంద్రబాబు... అమిత్ షాను కలిశారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం అనంతరం చంద్రబాబు టీడీపీ ఎంపీలను కలిశారు. ఎన్డీయే పెద్దలతో సమావేశం వివరాలను చంద్రబాబు తమ ఎంపీలతో పంచుకున్నారు.

Narendra Modi
Oath Taking
Rashtrapati Bhavan
New Delhi
NDA
BJP
India
  • Loading...

More Telugu News