Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు ఎస్కార్ట్ బెయిల్

Radhakishan Rao gets Escort bail

  • ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
  • తల్లి దశదిన కర్మ తదనంతర కార్యక్రమాల కోసం బెయిల్ మంజూరు
  • ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బెయిల్ మంజూరు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరు అయింది. ఆయనకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తల్లి దశదిన కర్మ తదనంతర కార్యక్రమాల కోసం నాంపల్లి కోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం రాధాకిషన్ రావు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. రాధాకిషన్ రావు తల్లి ఇటీవల మృతి చెందడంతో తల్లి అంత్యక్రియలలో పాల్గొనేందుకు కోర్టు అప్పుడు కూడా ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.

Phone Tapping Case
Radhakishan Rao
Telangana
  • Loading...

More Telugu News