Meta: వాట్సప్‌‌లోనూ ‘వెరిఫైడ్ బ్లూ టిక్’ మార్క్

Meta Verified is coming to WhatsApp Business in India

  • భారత్‌లోని యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానున్న ఫీచర్
  • ‘వాట్సప్ బిజినెస్’ ఖాతాలకు వర్తింపు
  • మెటా వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రకటన

‘ఎక్స్’లో మాదిరిగా త్వరలోనే వాట్సప్‌ ఖాతాదారులకు కూడా వెరిఫైడ్ బ్లూ టిక్ రాబోతోంది. భారత్‌లోని ‘వాట్సప్ బిజినెస్’ యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ను మెటా పరిచయం చేయబోతోంది. బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగిన మెటా వార్షికోత్సవ కార్యక్రమంలో కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. తొలుత భారత్‌తో పాటు, బ్రెజిల్, ఇండోనేషియా, కొలంబియా దేశాలలోని యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నారు.

‘వాట్సప్‌ వెరిఫైడ్ టిక్ మార్క్’ ద్వారా చట్టబద్ధ సంస్థలు, వ్యాపార సంస్థల ప్రామాణికత, షాప్‌లు (స్టోర్లు), సేవలకు సంబంధించిన అసలైన వాట్సప్ ఖాతాలను గుర్తించవచ్చునని జుకర్ బర్గ్ వెల్లడించారు. మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌ని ఆధారంగా యూజర్లు ధ్రువీకరించుకోవచ్చు అని పేర్కొన్నారు. వ్యాపారస్తులు నకిలీ వాట్సప్ ఖాతాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని జుకర్ బర్గ్ వివరించారు. కాగా ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు వెరిఫైడ్ టిక్‌ను మెటా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News