Shashi Tharoor: నేను సూపర్ ఓవర్ విక్టరీ సాధించాను: శశిథరూర్

Shashi Tharoor on his victory

  • తిరువనంతపురంలో తన గెలుపుపై శశిథరూర్ వ్యాఖ్య
  • ఏదేమైనా విజయం దక్కిందని, దీనిని ఆస్వాదిస్తున్నానన్న కాంగ్రెస్ నేత
  • ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాహుల్ గాంధీయేనని వ్యాఖ్య

తిరువనంతపురం నుంచి తాను సూపర్ ఓవర్ విక్టరీ సాధించానని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేశారు. శశిథరూర్ చేతిలో కేవలం 16 వేల ఓట్లతో ఓడిపోయారు. దీంతో, క్రికెట్ పరిభాషలో శశిథరూర్ తన విజయంపై స్పందించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఎదురైందన్నారు. తన విషయమే చూసుకుంటే తన నియోజకవర్గంలో పోటీ సూపర్ ఓవర్ వరకు వెళ్లిందన్నారు. ఏదేమైనా విజయం దక్కిందని... దానిని ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ రాహుల్ గాంధీయే అన్నారు. లోక్ సభలో ఆయనే ప్రతిపక్ష నేతగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబరిచిందని పేర్కొన్నారు. రాహుల్, ఖర్గే దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారని తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే లోక్ సభలో తమకు బలమైన ప్రాతినిథ్యం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కచ్చితంగా పాప్యులర్ ప్రతిపక్ష నేత ఉండాలన్నారు.

Shashi Tharoor
Congress
Kerala
NDA
  • Loading...

More Telugu News