Uttam Kumar Reddy: కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే డ్యామేజ్ అయింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy says Kaleswaram damaged in BRS time

  • అధికారులతో కలిసి సుందిళ్లను పరిశీలించిన మంత్రి
  • కాళేశ్వరం ఇప్పుడు నిరుపయోగంగా మారిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పనులు చేస్తున్నట్లు వెల్లడి

కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే డ్యామేజ్ అయిందని... ఇప్పుడు ఇది నిరుపయోగంగా మారిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి సుందిళ్ల బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీ పరిశీలనకు వచ్చానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.90 వేల కోట్లతో నిర్మించారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు నిరుపయోగంగా మారిందని వ్యాఖ్యానించారు.

తాము అధికారంలోకి రాగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలనను కోరామని... ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పనులు చేస్తున్నట్లు చెప్పారు. పనుల పురోగతిని పరిశీలించేందుకే తాను వచ్చినట్లు చెప్పారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల వద్ద పనులు సంతృప్తికరంగా సాగుతున్నట్లు తెలిపారు. సుందిళ్ల బ్యారేజీ వద్ద పనులు నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. అక్కడ పనులు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.

Uttam Kumar Reddy
Kaleshwaram Project
BRS
Congress
  • Loading...

More Telugu News