Andhra Pradesh: ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ
- ఏపీలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు
- పూనం మాలకొండయ్య, ముత్యాలరాజు, భరత్ గుప్తా బదిలీ
- సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలంటూ నూతన సీఎస్ ఉత్తర్వులు
ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో, అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య ప్రస్తుతం సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇక, రేవు ముత్యాలరాజు సీఎంవోలో కార్యదర్శి హోదాలో ఉండగా, నారాయణ భరత్ గుప్తా అదనపు కార్యదర్శిగా ఉన్నారు.
ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ)కి రిపోర్టు చేయాలని కొత్త సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్ బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే.