Dating Apps: డేటింగ్ యాప్స్ వాడుతున్నారా?..అయితే హైదరాబాద్‌లోని కొత్తరకం డేటింగ్ స్కామ్ గురించి తెలుసుకోండి!

New Scam in Hyderabad through Dating Apps

  • యువ‌త మొబైల్స్ లోని డేటింగ్ యాప్స్ ఆస‌రా‌గా ప‌బ్ ఓన‌ర్ల కొత్త మోసం
  • అంద‌మైన అమ్మాయిల‌ను పంపించి భారీ మొత్తంలో దోచేస్తున్న ప‌బ్స్‌
  • ఇటీవ‌ల ఇలాగే మోసపోయిన ఓ యువ‌కుడు
  • అనుమానంతో క్లబ్ తాలూకూ గూగుల్ రివ్యూస్ చూడ‌గా బ‌య‌ట‌ప‌డ్డ స్కామ్‌  

హైద‌రాబాద్‌లో తాజాగా కొత్త‌ర‌కం డేటింగ్ స్కామ్ బ‌య‌ట‌ప‌డింది. ఇటీవల అమ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు త‌మ మొబైల్ ఫోన్ల‌లో డేటింగ్ యాప్స్ ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. అయితే దాన్నే ఆస‌రరాగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు. దీంతో కొంత‌మంది యువ‌కులు భారీ మొత్తంలో న‌గ‌దు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. 

వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవల టిండర్ డేటింగ్ యాప్‌లో ఒక అబ్బాయికి రితికా అనే అమ్మాయి పరిచయమైంది. అలా పరిచయం అయిన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు రావాలని కోరింది. దాంతో ఆ తర్వాత రోజు ఇద్దరూ మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. 

కొద్దిసేపు ఇద్ద‌రూ క‌లిసి మాట్లాడుకున్న త‌ర్వాత‌ ఆ అమ్మాయి పక్కనే ఉన్న గ్యాలేరియా మాల్‌లోని మోష్ క్లబ్‌కి వెళ్దామని అతడిని అడిగింది. అందుకు అంగీకరించిన యువ‌కుడు రితికాను తీసుకుని ఆమె చెప్పిన క్లబ్‌కి వెళ్లాడు. అంతే.. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత‌ ఆమె తియ్యని మాటలు చెప్పి ఖ‌రీదైన మద్యం ఆర్డర్ చేసి రూ. 40,505 బిల్ క‌ట్టించింది.

మోసపోయిన అబ్బాయి తర్వాత అనుమానం వచ్చి క్లబ్ తాలూకూ గూగుల్ రివ్యూస్ చూశాడు. దాంతో అత‌నికి ఇలాగే మోసపోయిన వేరే యూజ‌ర్ రాసిన రివ్యూ క‌నిపించింది. అప్పుడు అత‌నికి క్లబ్ వాళ్లు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసమని అర్థమైంది. ఇలాగే ఆ అమ్మాయి, పబ్ చేతిలో చాలా మంది మోసపోయి రూ. 20 వేల నుండి రూ. 40 వేల నష్టపోయిన‌ట్లు గుర్తించాడు. 

  • Loading...

More Telugu News