Karthikeya: విలన్ గా చేసినందుకు ఫీల్ కావడంలేదు: హీరో కార్తికేయ

Karthikeya Interview

  • ఫస్టు హిట్ వరుస ఆఫర్లు తెచ్చిందన్న కార్తికేయ 
  • ఎలాంటి కథలు ఒప్పుకోవాలో తెలియలేదని వెల్లడి 
  • అందుకే ఆ విలన్ రోల్ చేశానని వివరణ 
  • ఆ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అయిందని వ్యాఖ్య


కార్తికేయ .. 'RX 100' సినిమాతో యూత్ ను తన వైపుకు తిప్పుకున్న హీరో. ఆ సినిమా తరువాత ఆయన వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ వెళ్లాడు. అయితే ఆ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. 

'RX 100' తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పటికి నాకు ఎలాంటి కథలను ఎంచుకోవాలనే విషయంలో సరైన అవగాహన లేదు. అందువలన నాకు మంచిగా అనిపించిన కథలకు ఓకే చెప్పుకుంటూ వెళ్లిపోయాను. ఒక్కో సినిమా ఒక్కో కారణంగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఆ విషయం ఆ తరువాత అర్థమైంది" అని అన్నాడు. 

"ఇక హీరోగా చేస్తున్న సమయంలో 'నానీస్ గ్యాంగ్ లీడర్'లో విలన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. విలన్ గా చేయకూడదని అనుకున్నాను. కానీ విక్రమ్ కుమార్ గారు నన్ను ఒప్పించారు. హీరోలు .. విలన్ గా చేయడమంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మనసులో ఆ కోరిక బలంగా ఉండటం వలన చేశాను. అయితే అలా విలన్ రోల్ చేయడం నా కెరియర్ కి ప్లస్ అయిందనే నేను భావిస్తున్నాను" అని చెప్పాడు. ఇక ఆయన తాజా చిత్రమైన 'భజే వాయు వేగం' ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సంగతి తెలిసిందే. 

Karthikeya
Actor
Bhaje Vayu Vegam
  • Loading...

More Telugu News