Manchu Vishnu: 'మా' నుంచి నటి హేమను సస్పెండ్ చేస్తున్నాం: మంచు విష్ణు

Hema suspended from MAA

  • పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ
  • అందుకే హేమను సస్పెండ్ చేస్తున్నట్లు మంచు విష్ణు వెల్లడి
  • క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టీకరణ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమను 'మా' సస్పెండ్ చేసింది. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమను సస్పెండ్ చేసే అంశంపై నిన్న సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు విష్ణు ప్రకటించారు.

ఈ మేరకు 'మా' సభ్యులకు సమాచారం అందించారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీసు ఇచ్చినా ఆమె స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హేమకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

హేమ ప్రాథమిక సభ్యత్వం రద్దు

బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని 'మా' సెక్రటరీ రఘుబాబు తెలిపారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందన్నారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మా అసోసియేషన్ నుంచి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Manchu Vishnu
Hema
MAA
Tollywood
  • Loading...

More Telugu News