Krithi Shetty: కృతి శెట్టి కెరియర్ కి 'మనమే' హెల్ప్ అయ్యేనా?

Maname Move Update

  • భారీ హిట్ తో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి 
  • హ్యాట్రిక్ హిట్ తరువాత కొట్టేసిన తేడా 
  • వరుస ఫ్లాపులతో తగ్గిన అవకాశాలు 
  • 'మనమే' పైనే ఆశలు పెట్టుకున్న బ్యూటీ


తెలుగు తెరపైకి తారాజువ్వలా దూసుకొచ్చిన హీరోయిన్స్ జాబితాలో కృతి శెట్టి పేరు కూడా కనిపిస్తుంది. సాధారణంగా కొత్తగా వచ్చిన హీరోయిన్స్ కి ఫస్టు సినిమాతోనే హిట్ పడటం కష్టం. అందునా హ్యాట్రిక్ హిట్ పడటం మరింత అరుదు. అయితే ఈ రెండు విషయాలు కృతి శెట్టి విషయంలో చాలా తేలికగా జరిగిపోయాయి.

తొలి సినిమాతోనే 100 కోట్లను కొల్లగొట్టిన రికార్డు ఆమె ఖాతాలో ఉంది. ఇక టాలీవుడ్ ను కొంతకాలం పాటు నాన్ స్టాప్ గా దున్నేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత చేసిన మరో మూడు సినిమాలు ఆమెను అంతే స్పీడ్ తో వెనక్కి నెట్టేశాయి. వరుసగా ఎదురైన పరాజయాలు, ఆ తరువాత రావలసిన ఆఫర్ల దూకుడును తగ్గించాయి.

అలా కొంత గ్యాప్ తీసుకున్న కృతి శెట్టి, మళ్లీ 'మనమే' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె శర్వానంద్ తో కలిసి నటించింది. రేపు థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా, ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి. 

Krithi Shetty
Sharwanand
Maname Movie
  • Loading...

More Telugu News