Chandrababu: పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ

Chandrababu to meet TDP MPs

  • ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ
  • శుక్రవారం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ చీఫ్
  • మోదీ ప్రమాణాస్వీకారానికి టీడీపీ ఎంపీలకు ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్టీ చీఫ్ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం పార్టీ ఎంపీలతో భేటీకి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీ తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో గురువారం భేటీ ఏర్పాటు చేశారు. దీనిపై అందరికీ సమాచారం పంపించారు. శుక్రవారం ఢిల్లీలో మరోమారు జరగనున్న ఎన్డీఏ కూటమి భేటీలో చంద్రబాబు టీడీపీ ఎంపీలతో కలిసి పాల్గొంటారు.

ఈ నేపథ్యంలోనే పార్టీ ఎంపీలతో గురువారం తన నివాసంలో భేటీ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఇప్పటికే టీడీపీ ఎంపీలకు ఆహ్వానం అందింది. ఈ విషయాలపై చర్చించేందుకే చంద్రబాబు తన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

Chandrababu
Undavalli
TDP MPs Meet
Modi
Delhi
NDA
  • Loading...

More Telugu News