Enforcement Directorate: చదలవాడ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీల్లో ఈడీ సోదాలు

Enforcement Directorate Raids Chadalavada Infratech Ltd
  • హైదరాబాద్‌తో పాటు ఒంగోలులో తనిఖీలు
  • ఎస్‌బీఐ నుంచి రూ. 167 కోట్ల రుణాలు తీసుకుని మోసం
  • సీబీఐ కేసు ఆధారంగా విచారిస్తున్న ఈడీ అధికారులు
  • బ్యాంకు నుంచి తీసుకున్న డ‌బ్బును దారి మ‌ళ్లించిన‌ట్లు గుర్తింపు
చదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, ఒంగోలు సహా ఆ కంపెనీకి చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ను చదలవాడ ఇన్‌ఫ్రాటెక్ రూ. 167 కోట్లు మోసం చేసిందని అధికారులు తెలిపారు. బ్యాంక్ నుంచి పొందిన నగదును మళ్లించిన‌ట్లు అధికారులు గుర్తించారు. చదలవాడ కంపెనీ డైరెక్టర్ చదలవాడ రవీంద్రబాబు, ఇతరులపై సీబీఐ, ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. ఆ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్‌ నిధులతో డైరెక్టర్లు ఇతరులతో కలిసి కుట్ర చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగులు, డైరెక్టర్ల ఖాతాల్లోకి రుణ మొత్తాలను మళ్లించారని ఈడీ అధికారులు గుర్తించారు. ఆ నిధులను దుర్వినియోగం చేశారని వెల్లడించారు. చదలవాడ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను రికవరీ చేశారు. నేరారోపణకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిధులు మళ్లింపునకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.
Enforcement Directorate
Raids
Chadalavada Infratech Ltd
Hyderabad
Andhra Pradesh

More Telugu News