Naga Babu: ఈ గెలుపు లక్ కాదు.. లాటరీ అంతకంటే కాదు: నాగబాబు
![Janasena Leader Naga Babu Road Tweet on Pawan Kalyan Victory in Pithapuram](https://imgd.ap7am.com/thumbnail/cr-20240606tn66614ff66a69c.jpg)
- పిఠాపురంలో పవన్ కల్యాణ్ అఖండ విజయం
- జనసేనాని విజయంపై నాగబాబు ట్వీట్
- ఈ విజయం పిఠాపురం ప్రజల అభిమానానికి బహుమానంగా పేర్కొన్న నాగబాబు
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధించింది. జనసేనాని పోటీచేసిన పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై ఏకంగా 70వేలకు పైగా మెజారిటీతో గెలవడం విశేషం. ఇలా పవర్‌స్టార్ ఈసారి ఎన్నికల్లో వన్‌మ్యాన్ షోతో దూసుకెళ్లారు.
ఇక పిఠాపురంలో పవన్ గెలుపుపై ఆ పార్టీ నేత నాగబాబు తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ గెలుపు లక్ కాదు, లాటరీ అంతకంటే కాదు అన్నారు. ఈ విజయం పిఠాపురం ప్రజల అభిమానానికి బహుమానం అని ఆయన పేర్కొన్నారు.
దిగ్విజయంతో మా భారం దించింది మీరే, ఓటేసి మాపై బాధ్యత పెంచింది మీరే అని ఓటర్లను ఉద్దేశించి నాగబాబు అన్నారు. భరోసాతో నిలబెట్టారని తెలిపారు. బాధ్యతతో కాదు భయంతో పనిచేస్తాం, పని చేయిస్తామన్నారు. పిఠాపురం పురోగతికి సేనాని సిగ్నేచర్ పెడతామంటూ నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.