Naveen Patnaik: మనం దేనికీ సిగ్గుపడాల్సిన పనిలేదు.. పార్టీ ఓటమిపై బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్

We Have Nothing To Be Ashamed Of Naveen Patnaik Tells Party MLAs

  • 24 ఏళ్లపాటు అధికారంలో ఉండి తొలిసారి పార్టీ ఓడిపోవడంపై స్పందన
  • తమ పాలనలో పేదరికం గణనీయంగా తగ్గిందని వెల్లడి
  • కొత్తగా ఎన్నికైన 51 మంది ఎమ్మెల్యేలతో సమావేశం

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం పదవికి రాజీనామా చేసిన నవీన్ పట్నాయక్ స్పందించారు. 24 ఏళ్ల కిందట తాను తొలిసారి సీఎంగా రాష్ర్ట పగ్గాలు చేపట్టినప్పుడు ఒడిశా జనాభాలో 70 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉండేవారని చెప్పారు. కానీ తర్వాత ప్రస్తుతం రాష్ర్టంలో పేదరికం 10 శాతానికి తగ్గిపోయిందని ఆయన గుర్తుచేశారు. ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకుగాను అధికార బీజేడీ కేవలం 51 సీట్లలో గెలవగా ప్రతిపక్ష బీజేపీ ఏకంగా 78 సీట్లలో విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలవగా మూడు చోట్ల స్వతంత్రులు, ఒక స్థానంలో సీపీఎం గెలిచింది.

ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు.  రాష్ట్రాభివృద్ధి కోసం బీజేడీ పనిచేస్తూనే ఉంటుందని చెప్పారు. ‘వ్యవసాయం, సాగునీరు, మహిళా సాధికారత విషయంలో మనం తీసుకొచ్చిన మార్పులు రాష్ట్రాన్ని ఈ స్థానంలో నిలిపాయి. అందువల్ల మనం ఇప్పుడు దేనికీ సిగ్గుపడాల్సిన పనిలేదు’ అని పట్నాయక్ వ్యాఖ్యానించారు.

నవీన్ పట్నాయక్ రాజీనామాతో ఒడిశా రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. 2000 సంవత్సరం మార్చి 5న నవీన్ పట్నాయక్ తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు ఆయన సీఎం పదవి చేపట్టారు. ఈ సమావేశానికి ముందు పట్నాయక్ ను బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ సాహూ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవీన్ పట్నాయక్ పెద్ద మనసుగల వారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారని చెప్పారు. ఆయనకు రుణపడి ఉంటామన్నారు.

  • Loading...

More Telugu News