AP Elections 2024 Resuts: ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎంతంటే..!
- కూటమికి మొత్తంగా 55.28 శాతం ఓట్లు
- టీడీపీకి 1,53,84,576 (45.60 శాతం) ఓట్లు
- వైసీపీకి 1,32,84,134 (39.37 శాతం) ఓట్లు
- టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య 21,00,442 ఓట్ల వ్యత్యాసం
- జనసేనకు 6.85 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 2.83 శాతం ఓట్లు
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేశారు. మొత్తంగా కూటమి 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది. అందులో టీడీపీ ఒంటరిగానే 135 అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అటు అధికార వైసీపీ 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు పరిమితమైంది.
ఇక ఈ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 55.28 శాతం ఓట్లు సాధించడం విశేషం. అదే వైసీపీకి 39.37 శాతం ఓట్లు పడ్డాయి. విడివిడిగా చూస్తే టీడీపీకి 1,53,84,576 (45.60 శాతం) ఓట్లు వస్తే, వైసీపీకి 1,32,84,134 (39.37 శాతం) ఓట్లు వచ్చాయి.
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు 6.85 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 2.83 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక వైసీపీకి కంటే కూటమికి 53,72,166 ఓట్లు అధికంగా వచ్చాయి. అటు టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య 21,00,442 ఓట్ల వ్యత్యాసం ఉంది.