Teenmaar Mallanna: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. తీన్మార్ మల్లన్నకు భారీ మెజారిటీ

Teenmaar Mallanna leads in second round MLC elections

  • నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
  • నల్లగొండ కేంద్రంలో రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి
  • ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
  • సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 14,672 ఓట్ల ఆధిక్యం

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు లో తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఇప్పటివరకూ రెండు రౌండ్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ (తీన్మార్ మల్లన్న) భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్‌లో మల్లన్నకు 34,575 ఓట్లు వచ్చాయి. మరోవైపు, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి 27,573 ఓట్లు పోలయ్యాయి. దీంతో, మల్లన్నకు 7,002 ఓట్ల ఆధిక్యం వచ్చింది.  బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 11,018 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. 

ఇప్పటివరకూ 1.92 లక్షల మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా, రెండు రౌండ్లలో కలిపి మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 56,113 ఓట్లు పోలయ్యాయి. ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్ల కౌంటింగ్ తరువాత మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News