Narendra Modi: ఇవాళ మా విలువైన భాగస్వాములను కలిశాం: ఎన్డీయే భేటీపై మోదీ స్పందన

Modi responds on NDA meet

  • ఢిల్లీలో ఎన్డీయే సమావేశం
  • జాతీయ అభివృద్ధి, ప్రాంతీయ పురోగతి కూటమి లక్ష్యమన్న మోదీ
  • వికసిత భారత్ దిశగా కృషి చేస్తామని ఉద్ఘాటన

ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశం పట్ల మోదీ స్పందించారు. "ఎంతో విలువైన మా ఎన్డీయే భాగస్వాములను కలవడం జరిగింది. జాతీయ పురోభివృద్ధితో పాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడం మా కూటమి లక్ష్యం. 140 కోట్ల మంది దేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడడంతో పాటు, వికసిత భారత్ దిశగా కృషి చేస్తాం" అంటూ మోదీ ట్వీట్ చేశారు. 

ఈ సందర్భంగా ఎన్డీయే సమావేశం ఫొటోలను కూడా మోదీ పంచుకున్నారు. ఇవాళ్టి ఎన్డీయే భేటీలో మోదీ, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, చిరాగ్ పాశ్వాన్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Narendra Modi
NDA
New Delhi
India
  • Loading...

More Telugu News