Metro Train: హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు అంతరాయం

Disruption in Metrao train services

  • సాంకేతిక కారణాలతో మెట్రో రైలు సేవలకు అంతరాయం
  • మియాపూర్ - ఎల్బీనగర్ మార్గంలో నిలిచిన రైళ్ల రాకపోకలు
  • భారీ వర్షం కారణంగా కిటకిటలాడుతున్న మెట్రో స్టేషన్లు, రైళ్లు

సాంకేతిక కారణాలతో బుధవారం సాయంత్రం మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో రైళ్లను నిలిపివేసినట్లు లోకో పైలట్లు తెలిపారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో చాలామంది ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కారు. మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎల్బీ నగర్ స్టేషన్ వద్ద ఎగ్జిట్ మిషన్లు మొరాయించాయి.

Metro Train
Metro Rail
Hyderabad
  • Loading...

More Telugu News