Mahesh Babu: 'ఆంధ్రప్రదేశ్ సీఎం' అంటూ చంద్రబాబుకు విషెస్ తెలిపిన మహేశ్ బాబు

Mahesh Babu wishes Chandrababu

  • నిన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి
  • ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ లకు మహేశ్ శుభాకాంక్షలు
  • పదవీకాలం విజయవంతం కావాలంటూ ఆకాంక్ష

సార్వత్రిక ఎన్నికల ఫలితాల పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రధానమంత్రిగా మరోసారి మహత్తర విజయం సాధించారంటూ నరేంద్ర మోదీకి మహేశ్ బాబు శుభాభినందనలు తెలియజేశారు. శక్తిమంతమైన, ఉజ్వలమైన భారతదేశాన్ని నిర్మించడంలో మీ విజయ పరంపరను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. 

"ఏపీ ముఖ్యమంత్రిగా ఘనవిజయం సాధించిన చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు. అభివృద్ధి, సంక్షేమం వెల్లివిరిసేలా మీ పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను" అంటూ చంద్రబాబును ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. 

"పవన్ కల్యాణ్ గారూ... మీ అద్భుత విజయానికి అభినందనలు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకం, విధేయతకు మీ విజయమే నిదర్శనం. ప్రజాసేవ దిశగా మీ కలలు సాకారం కావాలని, మీ పదవీకాలం విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ మహేశ్ బాబు ఎక్స్ లో స్పందించారు.

Mahesh Babu
Chandrababu
Narendra Modi
Pawan Kalyan
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News