Vijay Sethupathi: అంచనాలు పెంచుతున్న 'మహారాజ' ట్రైలర్!

Maharaja Movie Update

  • విజయ్ సేతుపతి తాజా చిత్రంగా 'మహారాజ'
  • మిథిలన్ దర్శకత్వం వహించిన సినిమా
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • ఈ నెల 14వ తేదీన విడుదలవుతున్న సినిమా


కోలీవుడ్ లో విజయ్ సేతుపతికి ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇక తెలుగులోను ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రమైన 'మహారాజ'ను, తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్ లో హీరో వేటకొడవలితో .. ఒళ్లంతా గాయాలతో కనిపిస్తున్నాడు. 

ఇక ఇప్పుడు వదిలిన ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి హీరో తన లక్ష్మి కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం, లక్ష్మి ఎవరనేది తెలియక వాళ్లు అయోమయంలో పడటం .. హీరోనే అనుమానిస్తూ వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

 కెరియర్ పరంగా ఇది విజయ్ సేతుపతికి 50వ సినిమా.  మిథిలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మమతా మోహన్ దాస్ .. భారతీరాజా .. అభిరామి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు.

Vijay Sethupathi
Mamatha Mohandas
Bharahi Raja
Maharaja

More Telugu News