Harsha Goenka: బీజేపీ, కాంగ్రెస్, ఎన్నికల సంఘం... అందరూ హ్యాపీ: ఫలితాలపై హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్

Yehi tho hai Sabka Saath Sabka Vikas

  • ఎన్నికల ఫలితాలతో అందరూ హ్యాపీ అంటూ పోస్ట్
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు బీజేపీ హ్యాపీ...
  • 100 సీట్లు వచ్చినందుకు కాంగ్రెస్ హ్యాపీ...
  • ఈవీఎంలపై ఎలాంటి విమర్శలు రానందుకు ఎన్నికల సంఘం హ్యాపీ అంటూ ట్వీట్


సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో అన్ని పార్టీలు లేదా అందరూ హ్యాపీ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఫలితాలతో అన్ని పార్టీలు హ్యాపీగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు బీజేపీ హ్యాపీ,
100 సీట్లు వచ్చినందుకు కాంగ్రెస్ హ్యాపీ,
ఉత్తర ప్రదేశ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిందుకు సమాజ్‌వాది పార్టీ హ్యాపీ,
మంచి ప్రదర్శన కనబరిచినందుకు ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, శివసేన(ఉద్దవ్ ఠాక్రే) హ్యాపీ, 
బెంగాల్‌లో మంచి సీట్లు వచ్చినందుకు టీఎంసీ హ్యాపీ,
ఈవీఎంలపై ఎలాంటి విమర్శలు రానందుకు ఎన్నికల సంఘం హ్యాపీ' అంటూ ట్వీట్ చేశారు.
ఇదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే అని చివరలో పేర్కొన్నారు.

Harsha Goenka
BJP
Congress
Lok Sabha Election Results
  • Loading...

More Telugu News