Ram Lakshman: ఇండస్ట్రీ మాకు ఎక్కువే ఇచ్చింది: 'రామ్ - లక్ష్మణ్'

Ram Lakshman Interview

  • ఫైట్ మాస్టర్స్ గా ఉన్న రామ్ లక్ష్మణ్ 
  • కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడం సహజమేనని వ్యాఖ్య 
  • డబ్బు .. పేరు ప్రతిష్ఠల పట్ల ఆశలేదని వెల్లడి
  • ఇండస్ట్రీకి రుణపడి ఉన్నామని వివరణ  


రామ్ - లక్ష్మణ్ .. టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఫైట్ మాస్టర్స్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఫైట్ మాస్టర్లు ఇండస్ట్రీకి వచ్చారు. అయినా రామ్ - లక్ష్మణ్ మాత్రమే కావాలనే సీనియర్ స్టార్ హీరోలు ఉన్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు పుస్తకాలకంటే జీవితాన్ని ఎక్కువగా చదివారు. అందువల్లనే వారి మాటల్లో లోతైన తత్త్వం వినిపిస్తుంది. 

ఐ డ్రీమ్ వారి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " ఇండస్ట్రీకి కొత్తవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది, కొత్తవారు వస్తున్నారు .. మమ్మల్ని పక్కన పెడుతున్నారని మేము బాధపడటం లేదు. మేము అనుకున్న దానికంటే ఇండస్ట్రీ మాకు ఎక్కువగానే ఇచ్చింది. అందుకు మేము ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి" అన్నారు. 

"మా ఆహారం .. అలవాట్లు .. మొత్తంగా చెప్పాలంటే మా లైఫ్ చాలా సింపుల్. డబ్బు .. పేరు ప్రతిష్ఠలు ఎండమావుల వంటివి. మనం ఎంత దూరం పరిగెత్తినా ఇంకాస్త దూరంలో అవి కనిపిస్తూనే ఉంటాయి. అందువలన వాటి గురించి మేము ఆలోచించడం లేదు . ఆశపడటం లేదు. మాకు రావలసిన అవకాశం పోయిందని నిరాశపడం .. మా కంటే ఎక్కువ అవసరంలో ఉన్న మరొకరికి ఆ ఛాన్స్ వెళ్లినందుకు హ్యాపీగా ఫీలవుతాం" అని చెప్పారు. 

Ram Lakshman
Tollywood
  • Loading...

More Telugu News