Sri Vishnu: ట్రాన్స్ జెండర్ పాత్రలో శ్రీవిష్ణు?

Swag Movie Update

  • శ్రీవిష్ణు తాజా చిత్రంగా రూపొందుతున్న 'Swag'
  • 'రాజరాజ చోర' దర్శకుడితో చేస్తున్న రెండో మూవీ 
  • 14 గెటప్పులలో కనిపించనున్న హీరో 
  • ఆయన సరసన సందడి చేయనున్న రీతూ వర్మ

శ్రీవిష్ణు కథానాయకుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వెళుతున్నాడు. కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కంటెంట్ ను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఈ మధ్య కాలంలో ఆయన చేసిన 'సామజవర గమన' .. ''ఓమ్ భీమ్ బుష్' సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ఆయన తాజా చిత్రంగా 'Swag' రూపొందుతోంది.

ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు శ్రీవిష్ణుతో చేసిన 'రాజ రాజ చోర' సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా హిట్ కావడం వలన ఆయనకి మంచి పేరు వచ్చింది. కొంత గ్యాప్ తరువాత ఆయన శ్రీవిష్ణుతో కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే  సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. 

ఈ సినిమాలో శ్రీవిష్ణు 14 రకాల గెటప్పులలో కనిపించనున్నాడని అంటున్నారు. ట్రాన్స్ జెండర్ గా కూడా ఆయన కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.  రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ కీలకమైన పాత్రలో కనిపించనుంది.   

  • Loading...

More Telugu News