Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..

Chandrababu Naidu Set To Be Andhra Chief Minister PM To Attend Oath Ceremony

  • నాలుగోసారి సీఎం కానున్న టీడీపీ అధినేత
  • జూన్ 9న ప్రమాణస్వీకారానికి ఛాన్స్
  • కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని మోదీ

ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి అసాధారణ విజయం దక్కిన విషయం తెలిసిందే. దీంతో, చంద్రబాబు నాలుగోసారి ఏపీ సీఎం కానున్నారు. 1995-2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా, 2014-19లో విభజిత ఏపీకి సీఎంగా చంద్రబాబు ఉన్న సంగతి తెలిసిందే. 

ఇక ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి 164 సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. ఏపీ లోక్ సభ స్థానాల్లో టీడీపీకి 16, జనసేకు 2, బీజేపీకి 3 సీట్లు దక్కాయి. వైసీపీ నాలుగు సీట్లకే పరిమితమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ గేమ్ ఛేంజర్లుగా అవతరించాయి.

  • Loading...

More Telugu News