Chiranjeevi: ప్రియమైన చంద్రబాబు గారికి... అంటూ చిరంజీవి ట్వీట్

Chiranjeevi appreciates Chandrababu

  • ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అద్భుత విజయం
  • 160కి పైగా అసెంబ్లీ స్థానాలతో విజయభేరి
  • 21 లోక్ సభ స్థానాలు కైవసం

ఏపీలో టీడీపీ, దాని మిత్రపక్షాలు అమోఘమైన రీతిలో ఎన్నికల ఫలితాలు సాధించడం  పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 

"ప్రియమైన చంద్రబాబు గారికి... చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మహత్తర విజయం... మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తీసుకురాగలిగిన మీ దక్షతకు నిదర్శనం. 

రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ గారి మీద ప్రజలు కనబర్చిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకుంటారని భావిస్తున్నాను. రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడినపెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను" అంటూ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Chiranjeevi
Chandrababu
Pawan Kalyan
Narendra Modi
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News