Narendra Modi: స్వల్ప మెజార్టీతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంపై విదేశీ మీడియా స్పందన

How foreign media reported on 2014 lok sabha elections

  • ఈసారి మోదీకి భారీ విజయం దక్కేలా కనిపించడం లేదని గార్డియన్ కథనం
  • ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్య పార్టీలు అవసరమని పేర్కొన్న ది టైమ్స్
  • స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్ళాయని పేర్కొన్న వాల్ స్ట్రీట్ జర్నల్

లోక్ సభ ఎన్నికల ఫలితాలపై విదేశీ మీడియా స్పందించింది. మోదీ మూడోసారి గెలుస్తున్నారని... కానీ మ్యాజిక్ ఫిగర్‌కు కొన్ని సీట్లు తక్కువ పడవచ్చునని 'గార్డియన్' పత్రిక పేర్కొంది. ఈసారి మోదీకి భారీ విజయం దక్కేలా లేదని ప్రారంభ ట్రెండ్‌ను బట్టి అర్థమవుతోందని పేర్కొంది. అదే సమయంలో 2014 నుంచి అధికారంలో ఉన్న మోదీని గద్దె దించడానికి 20కి పైగా పార్టీలు ఒక్కటయ్యాయని... కానీ 234 సీట్లతో సరిపెట్టుకున్నాయని పేర్కొంది.

మోదీ మూడోసారి గెలుస్తున్నారని ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోందని 'వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మోదీకి భాగస్వామ్య పార్టీలు అవసరమని 'ది టైమ్స్' పత్రిక పేర్కొంది. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్‌ సీట్లు తగ్గడంతో ఇతర పార్టీలతో జతకట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది. నరేంద్ర మోదీ గెలుపు అంత ఈజీగా లేకపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయని 'వాల్ స్ట్రీట్ జర్నల్' పేర్కొంది. భారత్‌లో మళ్లీ కూటమి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొంది.

  • Loading...

More Telugu News