Pawan Kalyan: పవన్ కల్యాణ్ భారీ విజయం... కృతజ్ఞతలు తెలిపిన అన్నా లెజ్నెవా, అకీరా

Anna Lezneva thanked everyone after Pawan Kalyan win

  • పిఠాపురంలో పవన్ కల్యాణ్ విక్టరీ
  • వంగా గీతపై 70,354 ఓట్ల భారీ ఆధిక్యం
  • పవన్ నివాసం వద్ద కోలాహలం
  • మద్దతుదారులకు చేతులెత్తి నమస్కరించిన అన్నా లెజ్నెవా

జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి భారీ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల  భారీ ఆధిక్యంతో గెలిచారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం లాంఛనమే. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, తనయుడు అకీరా నందన్ ఓటర్లకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

కౌంటింగ్ ట్రెండ్స్ బయటికి రాగానే పవన్ కల్యాణ్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. పవన్ భార్య లెజ్నెవా బయటకు వచ్చి మద్దతుదారులందరికీ చేతులెత్తి నమస్కరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అటు అకీరా నందన్ కూడా తండ్రి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

Pawan Kalyan
Anna Lezneva
Akira
Pithapuram
Janasena
Vanga Geetha
YSRCP

More Telugu News