Sharwanand: 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది ఇక్కడే!

Maname Move Update
  • శర్వానంద్ హీరోగా రూపొందిన 'మనమే'
  • ఆయన జోడీగా కనిపించనున్న కృతి శెట్టి 
  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన కంటెంట్ 
  • ఈ నెల 7వ తేదీన సినిమా విడుదల

శర్వానంద్ కథానాయకుడిగా 'మనమే' సినిమా రూపొందింది. కెరియర్ పరంగా ఇది ఆయన 35వ సినిమా. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి కథానాయికగా అలరించనున్న ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును పిఠాపురంలో జరపనున్నారనే టాక్ వచ్చింది.  కొంత సేపటిక్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖాయం చేసి, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

ఈ నెల 5వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ - పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రాహుల్ రామకృష్ణ .. రాహుల్ రవీంద్రన్ .. అక్షయ ఖాన్ కనిపించనున్నారు. 

  • Loading...

More Telugu News