Pawan Kalyan: పిఠాపురంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ బంప‌ర్ విక్ట‌రీ!

Janasena President Pawan Kalyan Wins Pithapuram
  • 70 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన జ‌న‌సేనాని
  • వైసీపీ అభ్యర్ధి వంగా గీత ప‌రాజ‌యం
  • సంబరాల్లో మునిగిపోయిన జ‌న‌సేన పార్టీ శ్రేణులు

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తన సమీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై గతంలో ఎన్నడూ లేనంత విధంగా 70,354 ఓట్ల మెజార్టీతో విజయఢంకా మోగించారు. పవన్‌ కల్యాణ్‌ ఇక అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ఫాలోవర్లు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

అటు పవన్  కల్యాణ్‌ గెలిచిన విషయాన్ని తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. టీవీ స్క్రీన్‌పై పవన్ విజయాన్ని చూసి.. ఆయన సోదరి కాస్త ఎమోషనల్ అయ్యారు. కాగా, కుటుంబ సభ్యులు, జనసైనికులతో కలిసి పిఠాపురంలో నాగబాబు ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక పవన్ విజయంతో జనసైనికులు సంబరాల్లో మునిగిపోయారు.

ఇక‌ ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్‌ నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ 133 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News