Ravindranath Reddy: కమలాపురంలో సీఎం జగన్ మేనమామ ఓటమి

CM Jagan uncle Ravindranath Reddy defeated by TDP candidate

  • రేసుగుర్రాల్లా దూసుకెళుతున్న టీడీపీ అభ్యర్థులు
  • కమలాపురంలో టీడీపీ అభ్యర్థి కృష్ణచైతన్య రెడ్డి విక్టరీ
  • ఓటమిపాలైన పి.రవీంద్రనాథ్ రెడ్డి

పోటీ చేసిన ప్రతి జిల్లాలోనూ టీడీపీ అభ్యర్థుల హవా స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ సునామీలో సీఎం జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్ రెడ్డి కూడా గల్లంతయ్యారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆయన ఓటమి పాలయ్యారు. కమలాపురం టీడీపీ అభ్యర్థి పి.కృష్ణచైతన్య రెడ్డి తిరుగులేని విజయం అందుకున్నారు. 

17 రౌండ్ల అనంతరం కృష్ణచైతన్య రెడ్డి 23,063 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. 17 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కృష్ణచైతన్య రెడ్డికి 88,853 ఓట్లు రాగా,  వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డికి 65,790 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇంకా మరొక్క రౌండ్ లెక్కింపు మిగిలుంది.

More Telugu News