Sai Bhaskar: ఆ సినిమా నాన్నకు నష్టాలు తెచ్చిపెట్టింది: ఆదుర్తి తనయుడు

Adurthi Sai Bhaskar Interview
  • గొప్ప దర్శకుడిగా ఆదుర్తికి పేరు 
  • ఆయన మొదటి సినిమా ఫ్లాప్ 
  • అన్నపూర్ణ సంస్థకి వరుస హిట్స్ ఇచ్చిన దర్శకుడు 
  • ఆ సినిమా వలన నష్టాలొచ్చాయని వెల్లడి

వెండితెరపై వైవిధ్యభరితమైన కథలను పరిగెత్తించిన దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావు కనిపిస్తారు. 1950ల నుంచి దర్శకుడిగా ఆయన అనేక ప్రయోగాలను చేస్తూ .. తన ప్రత్యేకతను చాటుతూ వెళ్లాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ ఆయన అల్లుకున్న కథలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి  ఆదుర్తి గురించి ఆయన తనయుడు సాయిభాస్కర్ ప్రస్తావించాడు.

" మా నాన్నగారి వాళ్లది రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు. సినిమాల పట్ల గల ఆసక్తితో ఆయన ఇంట్లో చెప్పకుండా కలకత్తా వెళ్లిపోయారు. ఆ తరువాత ఇండస్ట్రీలో అనేక మంది దగ్గర పనిచేసిన అనుభవంతో ఆయన చెన్నైకి చేరుకున్నారు. దర్శకుడిగా అయన చేసిన మొదటి సినిమా 'అమర సందేశం' ఫ్లాప్ అయింది. అయినా అక్కినేని సిఫార్స్ కారణంగా అన్నపూర్ణ బ్యానర్లో అవకాశం దక్కింది" అని అన్నారు. 

అన్నపూర్ణ బ్యానర్లో ఆయన వరుస విజయాలను అందిస్తూ వెళ్లారు. అడపా దడపా హిందీ సినిమాలకి దర్శకత్వ వహించాడు. మలయాళంలోని 'అగ్నిపుత్రి'  సినిమాను ఆయన హిందీలో 'దర్పణ్' అనే పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమాకి ఆయనే నిర్మాత. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో, అప్పటి వరకూ సంపాదించినదంతా పోయింది. 'మాయదారి మల్లిగాడు' సినిమా నుంచి మళ్లీ ఆయన కోలుకున్నారు" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News