TDP: టీడీపీకి రెండో విజ‌యం.. టీడీపీ ఖాతాలోకి రాజ‌మండ్రి అర్బ‌న్‌

TDP wins Rajamahendravaram Urban
  • రాజమండ్రి అర్బ‌న్‌ నియోజకవర్గంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ విక్ట‌రీ
  • వైసీపీ అభ్య‌ర్థి మార్గాని భ‌ర‌త్‌పై 55వేల‌కు పైగా ఓట్ల తేడాతో విజ‌యం
  • ఇప్ప‌టికే రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఘ‌న విజ‌యం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో రెండో విజయం చేరింది. రాజమండ్రి అర్బ‌న్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘ‌న విజ‌యం సాధించారు. ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భ‌ర‌త్‌పై 55వేల‌కు పైగా ఓట్ల తేడాతో శ్రీనివాస్ నెగ్గారు. అటు రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సైతం 63,056 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విష‌యం తెలిసిందే. ఇక‌ ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. కూట‌మి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. భారీ విజ‌యం దిశ‌గా కూట‌మి అడుగులేస్తోంది.

  • Loading...

More Telugu News