BJP Head Office: బీజేపీ హెడ్డాఫీసులో మొదలైన సంబరాలు

Celebrations AT BJP Headoffice

  • పెద్దమొత్తంలో సిద్దం చేసిన లడ్డూలు
  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బీజేపీ హవా
  • ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ కొనసాగడంతో కార్యకర్తల్లో సంతోషం

లోక్ సభ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్న వేళ బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో సంతోషం నెలకొంది. బీజేపీ ఢిల్లీ ఆఫీసులో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయని సమాచారం. కార్యకర్తలు, నాయకులకు పంచడానికి పెద్దమొత్తంలో స్వీట్లను సిద్ధం చేశారు. మోతిచూర్ లడ్డూలు, ఛోలే బటురా సహా పలు స్వీట్లను ఇప్పటికే తెప్పించారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలతో కలిసి నాయకులు సంబరాలు మొదలుపెట్టారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ కార్యకర్తల కోసం ఏర్పాట్లు చేశారు. బీజేపీ విజయం కోసం ఢిల్లీలోని తన పార్టీ కార్యాలయంలో పూరీలు, లడ్డూలను పెద్దఎత్తున సిద్ధం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ తమ కార్యకర్తలకు చోలే భటుర్ సిద్ధం చేసింది.

BJP Head Office
Delhi BJP
Celebrations
Laddoo
Exit Polls
  • Loading...

More Telugu News