YSRCP: క‌డ‌ప‌లో వైసీపీకి ఎదురుగాలి!

Shock to YSRCP In Kadapa

  • క‌డ‌ప‌ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్య‌ర్థి మాధ‌వీరెడ్డి ఆధిక్యం
  • ఉప ముఖ్య‌మంత్రి అంజాద్ బాషా వెనుకంజ‌
  • పులివెందుల‌లో సీఎం జ‌గ‌న్ ముందంజ‌
  • క‌డప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్య‌ర్థి అవినాశ్ రెడ్డి వెనుకంజ‌

క‌డ‌ప‌లో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. క‌డ‌ప‌ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్య‌ర్థి మాధ‌వీరెడ్డి 655 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. ఉప ముఖ్య‌మంత్రి అంజాద్ బాషా వెనుకంజ‌లో ఉన్నారు. అటు పులివెందుల‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇక క‌డప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్య‌ర్థి అవినాశ్ రెడ్డి సైతం వెనుక‌బ‌డ్డారు. కూట‌మి అభ్య‌ర్థి భూపేశ్ ప్ర‌స్తుతం ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్య‌మంత్రి సొంత జిల్లాలో ఇద్ద‌రు వైసీపీ అభ్య‌ర్థులు వెన‌క‌బ‌డ‌టం వైసీపీకి ఊహించ‌ని షాక్ అని చెప్పాలి.

YSRCP
Kadapa District
YS Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News