Tamilisai Soundararajan: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సహా వెనుకంజలో బీజేపీ కీలక నేతలు!

BJP key leaders are in trailing

  • తెలంగాణలో ముందంజలో బీజేపీ కీలక నేతలు
  • తమిళనాడులో అన్నామలై, తమిళిసై వెనుకంజ
  • కేరళలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు సురేశ్ గోపి వెనుకంజ

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పలువురు బీజేపీ కీలక అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. దక్షిణాదిన తెలంగాణలో బీజేపీ కీలక నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ తదితరులు ముందంజలో ఉన్నారు.

తమిళనాడు కీలక నేతలు మాత్రం వెనుకబడ్డారు. తొలుత ఆధిక్యంలో కనిపించిన కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై ఆ తర్వాత వెనుకబడ్డారు. చెన్నై దక్షిణ స్థానం నుంచి పోటీ చేసిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెనుకంజలో ఉన్నారు.

బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీ చేస్తున్న పన్నీరుసెల్వం వెనుకంజలో ఉన్నారు. కేరళలోని తిరువనంతపురం నుంచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, త్రిసూర్ బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి వెనుకంజలో ఉన్నారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ముందంజలో ఉన్నారు.

Tamilisai Soundararajan
BJP
Telangana
Suresh Gopi
Lok Sabha Polls
  • Loading...

More Telugu News