Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు ఆధిక్యం... 20 చోట్ల కూటమి ముందంజ

Pawan Kalyan continues lead in Pithapuram

  • ఏపీలో కొనసాగుతున్న కౌంటింగ్
  • టీడీపీ 16 చోట్ల ఆధిక్యం... జనసేన 3, బీజేపీ 1 చోట ఆధిక్యం
  • మంగళగిరిలో నారా లోకేశ్ ముందంజ

ఏపీలో కౌంటింగ్ కొనసాగుతుండగా, కూటమి 20 అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో నిలిచింది. టీడీపీ 14, జనసేన 3, బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ముందంజలో ఉన్నారు. 

మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్, చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్, తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు, పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడ (సెంట్రల్)లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమ, విజయవాడ (పశ్చిమ)లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. 

ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 2,760 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాజమండ్రి అర్బన్ లో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ముందంజలో ఉన్నారు.

Pawan Kalyan
Pithapuram
Janasena
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News