BJP: తెలంగాణలో బీజేపీ దూకుడు... బండి సంజయ్ సహా 5 స్థానాల్లో ముందంజ

BJP in leading four seats in telangana

  • మహబూబ్ నగర్‌లో ముందంజలో డీకే అరుణ
  • మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్ ముందంజ
  • నిజామాబాద్ నుంచి లీడింగ్‌లో ధర్మపురి అర్వింద్
  • ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ఆధిక్యం

తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తోంది. ఉదయం గం.8.40 వరకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో బీజేపీ ఐదు స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి నగేశ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌లు ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి, వరంగల్ నుంచి కడియం కావ్య ముందంజలో ఉన్నారు.

BJP
Congress
Telangana
Lok Sabha Polls
Bandi Sanjay
  • Loading...

More Telugu News