Rahul Gandhi: రాయ్‌బరేలిలో రాహుల్, అమేథి నుంచి స్మృతి, కోయంబత్తూర్ నుంచి అన్నామలై లీడింగ్
- రాయ్‌బరేలి, వయనాడ్ నియోజకవర్గాల నుంచి ముందంజలో రాహుల్ గాంధీ
- అమేథిలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆధిక్యం
- కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థి అన్నామలై లీడింగ్
లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. ఉదయం గం.8.25 వరకు ఎన్డీయే కూటమి 140 స్థానాల్లో, ఇండియా కూటమి 70 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు.
రాహుల్ గాంధీ రాయ్‌బరేలి, వయనాడ్ నియోజకవర్గాల నుంచి ముందంజలో నిలిచారు.
అమేథిలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు. యూపీలోని మెయిన్‌పురి నుంచి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ లీడింగ్‌లో ఉన్నారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థి అన్నామలై లిడింగ్‌లో ఉన్నారు. ఢిల్లీలోని 7 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.