Telangana: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు?

Vaasthu Changes in telangana secretariat

  • ఇప్పటి వరకు మెయిన్ గేట్ నుంచి లోనికి సీఎం కాన్వాయ్...
  • ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి లోనికి... ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయం
  • సీఎం కార్యాలయం ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు మార్పు

తెలంగాణ సచివాలయంలో వాస్తుమార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సచివాలయం మెయిన్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ లోనికి వచ్చేది. ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి లోనికి వచ్చి... ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించారు. సౌత్ ఈస్ట్ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంను 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మార్చాలని నిర్ణయించారు. మరికొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు.

Telangana
Revanth Reddy
TG Secretariat
  • Loading...

More Telugu News