Stock Market: మళ్లీ మోదీనే వస్తారన్న అంచనాలతో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

Stock Markets records single day high

  • మళ్లీ ఎన్డీయేకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
  • నేడు ఆరంభం నుంచే స్టాక్ మార్కెట్లలో జోరు
  • గత మూడేళ్లలో సింగిల్ డే గరిష్ఠాలు నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీ

దేశంలో రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనుండగా, నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో... నేడు భారత స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత మూడేళ్లలో ఎన్నడూ అందుకోని గరిష్ఠ లాభాలు అందుకున్నాయి. 

సెన్సెక్స్ 2,507 పాయింట్ల వృద్ధితో 76,468.78 వద్ద ముగియగా... నిఫ్టీ 733 పాయింట్ల లాభంతో 23,263 వద్ద ముగిసింది. 2021 జనవరి నుంచి సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కరోజులో ఇన్ని పాయింట్ల వృద్ధి నమోదు చేయడం ఇదే ప్రథమం. ఇవాళ ఒక్కరోజే మదుపరులకు రూ.14 లక్షల కోట్ల ఆదాయం వచ్చిపడింది. 

ఎగ్జిట్ పోల్స్ లో చాలావరకు ఎన్డీయేనే వస్తుందన్న అంచనాలు వెలువరించడం, స్టాక్ మార్కెట్లను విపరీతంగా ప్రభావితం చేసింది. ఇవాళ ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ కళ్లెం వదిలిన గుర్రాల్లా పరుగులు తీశాయి. సెన్సెక్స్ 3.39, నిఫ్టీ 3.25 శాతం వృద్ధి నమోదు చేశాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ-పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ లాభాలు అందుకున్నాయి.

ఐషర్ మోటార్స్, ఎల్టీఐ మైండ్ ట్రీ, హెచ్ సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టాలు చవిచూశాయి.

Stock Market
Single Day
Sensex
Nifty
NDA
Narendra Modi
India
  • Loading...

More Telugu News