Venkatesh Iyer: ఓ ఇంటివాడైన కేకేఆర్ స్టార్ వెంకటేశ్ అయ్యర్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?

Venkatesh Iyer Ties The Kont With Shruti Raghunathan

  • శ్రుతి రఘునాథన్ మెడలో మూడుముళ్లు వేసిన వెంకటేశ్ అయ్యర్
  • కొద్దిమంది అతిథుల సమక్షంలో వివాహం
  • హాజరైన క్రికెటర్ వరుణ్ చక్రవర్తి
  • శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్న అభిమానులు

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్టార్ వెంకటేశ్ అయ్యర్ నిన్న ఓ ఇంటివాడయ్యాడు. శ్రుతి రఘునాథన్ మెడలో మూడుముళ్లు వేశాడు. వెంకటేశ్ అయ్యర్ పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దక్షిణ భారతదేశ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో పంచెకట్టులో వెంకటేశ్, గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఉన్న నీలం రంగు చీరలో శ్రుతి మెరిసిపోయారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో శుభాకాంక్షలతో అభిమానులు హోరెత్తిస్తున్నారు. దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు శుభాకాంక్షలంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అతి కొద్దిమంది సమక్షంలో జరిగిన ఈ వివాహానికి క్రికెటర్ వరుణ్ చక్రవర్తి హాజరయ్యాడు.

ఎవరీ శ్రుతి రఘునాథన్?
లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శ్రుతి మర్చండైజ్ ప్లానర్‌గా పనిచేస్తున్నారు. బీకాంలో డిగ్రీ పూర్తిచేసిన శ్రుతి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్‌టీ) నుంచి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

Venkatesh Iyer
Shruti Raghunathan
KKR
Cricket News
  • Loading...

More Telugu News